జమ్మలమడుగు: కడప : అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసు బ్యాండ్ షో కార్యక్రమం
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం కడప నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సంగీత కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అదనపు ఎస్.పి ప్రకాష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, పండుగల సమయాల్లో అందరు ఇళ్లలో ఉంటె పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటారని, నిరంతరం ప్రజల పరిరక్షణకు అంకితమవుతారన్నారు.