జమ్మలమడుగు: ముద్దనూరు : పట్టణంలో బ్రేక్ ఫెయిలై రైల్వే గేట్లను గుద్దుకున్న లారీ.. తప్పిన పెను ప్రమాదం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ముద్దునూరు మండలం ముద్దనూరు పట్టణంలోని రైల్వే గేట్లను సోమవారం ఓ లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా హ్యాండ్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు కోసం రైల్వే గేట్లను వేసి ఉండగా జమ్మలమడుగు ఘాట్ రోడ్ లో నుంచి సిమెంటు లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి రైల్వే గేట్లను ఢీకొనడంతో రెండు గేట్లు విరిగిపోయాయి. అనంతరం లారీని మసీదు దగ్గర లారీ డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేసి ఆపారన్నారు. లారీ డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేసి.. లారీని ఆపకపోయి ఉంటే ఎదురుగా ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్ళి పెను ప్రమాదం జరిగేదన్నారు.