నల్లమల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం
Nandyal Urban, Nandyal | Sep 17, 2025
నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో బుధవారం బస్సు, కారు ఢీకొన్నాయి.గిద్దలూరు నుంచి వస్తున్న పల్లె వెలుగు బస్సు, నంద్యాల నుంచి వెళ్తున్న కారు దిమ్మెల మలుపు వద్ద ఢీకొన్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.