రాష్ట్రంలో 340 మంది నిరుద్యోగ నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతకు యుపిఎస్సి సివిల్ ఉచిత శిక్షణ డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి బుధవారం తెలిపారు. దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగే ఈ శిక్షణను మహిళలకు 33% కేటాయించడం జరుగుతుందని శిక్షణ సమయంలో ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం ఉంటుందని. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలలోని అంబేద్కర్ స్టడీ సర్కిలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన యువకులు ఈనెల 13వ తేదీ నుండి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాల కోసం apstudy Circle.apcfss.in వెబ్సైట్ ను చూడాలని అన్నారు.