బిచ్కుంద: బిచ్కుంద మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే.
బిచ్కుంద మైనారిటీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జుక్కల్ ఎమ్మెల్యే... కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. గురుకులంలోని పరిసరాలను పరిశీలించి అక్కడి సిబ్బందిని సమస్య లు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు.