తిరుపతి జిల్లా చంద్రగిరి లో భారీ చోరీ
తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణం ప్రశాంత్ నగర్ లో భారీ దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి రిటైర్డ్ సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నజీర్ ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు లోపలికి చొరపడ్డారు 50 సవర్ల బంగారం కేజీ వెండి 5 లక్షల రూపాయలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు గుర్తించారు ఆయన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.