నారద పుష్కరణిలో ఘనంగా కార్తీక దీపోత్సవం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన నారద పుష్కరిణిలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక సోమవారము పురస్కరించుకొని నారద పుష్కరిణిని వివిధ పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్కరణిలో కార్తీక దీపాలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.