అసిఫాబాద్: 27న మద్యం దుకాణాలకు లక్కీ డ్రా,టెండర్లకు మరో మూడు రోజుల అవకాశం
కొత్త మద్యం దుకాణాలకు ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న దరఖాస్తుల గడువు ముగిసే సేపు 32 వైన్స్ షాపులకు 602 టెండర్లు వచ్చయని చెప్పారు. ప్రభుత్వం టెండర్ల స్వీకరణకు ఈ నెల 23 వరకు గడువు పొడిగించినప్పుటికీ ఆదివారం. సోమవారం దీపావళి సెలవు కావడంతో మరో మూడు రోజులే అవకాశం కల్పించినట్లు అయింది.