నల్లచెరువులోని ఎర్రగుంటపల్లి వద్ద పొలంలోకి దూసుకెళ్లిన కారు, తప్పిన పెను ప్రమాదం
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి వద్ద కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు పల్టీలో కొట్టుకుంటూ పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కారులో ఉన్న వారితో పాటు అడ్డుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.