గుడివాడలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్
Machilipatnam South, Krishna | Sep 17, 2025
గుడివాడ 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ బుధవారం పర్యటించారు. వార్డు ప్రజలు తమ నీరు, పారిశుద్ధ్యం సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నీటి సరఫరా సమయంలో పంతుల షెడ్ రోడ్డు, నీలం బెంజిమెన్ రోడ్డులను సందర్శించిన కమిషనర్, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త పైపైన్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలను రూపొందించాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.