సత్యవేడు నియోజకవర్గంలో రేషన్ డీలర్లకు కొత్త ఈపాస్ యంత్రాలు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు
" రేషన్ డీలర్లకు కొత్త “ఈపాస్ ” యంత్రాలు సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్య పాలెం, సత్య వేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లకు కొత్త ఈపాస్ యంత్రాలను రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. సత్యవేడు మండలంలో 55 మంది డీలర్లకు, వరదయ్య పాలెం 43 మందికి, బుచ్చినాయుడు కండ్రిగ 28 మందికి ఈపోస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కో ఈ పాస్ యంత్రం ధర రూ.35 వేలు ఉంటుందన్నారు.