నారాయణ్‌ఖేడ్: ప్రజలు దేశభక్తిని పెంపొందించుకోవాలి: నారాయణఖేడ్‌లో డిఎస్పి వెంకటరెడ్డి ,
వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తాలో శుక్రవారం సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వందేమాతరం రూపొందించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిఎస్పి వెంకటరెడ్డి మాట్లాడుతూ వందేమాతర గీతాన్ని బంకిన్చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సామూహిక గీతాలపన నిర్వహించినట్లు తెలిపారు.