పుల్కల్: పెద్దారెడ్డిపేట చౌరస్తా వద్ద దోపిడి దొంగల బ్యాచ్ ను కట్టేసి చితకబాదిన గ్రామస్తులు
గత కొద్దిరోజులుగా వరుస చోరీలకు పాల్పడుతున్న దోపిడి దొంగల బ్యాచ్ను సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట చౌరస్తా వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామస్తులు కట్టేసి చితక బాదారు. ఇద్దరు యువకులు ఒక మహిళ గ్రామంలో అనుమానంగా తిరుగుతూ ఉండడంతో నిలదీసిన గ్రామస్తులు వారిని పట్టుకుని నిలదీశారు. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం వట్పల్లి మండల కేంద్రంలో రెండు బైక్ లను అపహరించిన ఈ ముఠా రాత్రి ఆందోల్ మండలం నేరేడిగుంట చౌరస్తా వద్ద ఓ దుకాణంలో రెండు సిలిండర్లను దోచుకెళ్ళారు. పెద్దారెడ్డిపేట వద్ద అనుమాన స్పదంగా కనిపించడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించా