మైనంపాడులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో టీఎల్ఎం తయారీపై వర్క్‌షాప్ జరిగింది. డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు మాట్లాడుతూ.. బోధన, అభ్యసన సామాగ్రి ఉపాధ్యాయులకు బోధన సమయంలో సహాయకారిగా ఉంటాయని చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే విషయాలను ఆసక్తికరంగా మార్చటానికి బోధనోపకరణలు సహాయపడతాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేయాలో వర్క్‌షాప్‌లో వివరించారు.