హిమాయత్ నగర్: తలాబ్ చంచలం డివిజన్ పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్
పాతబస్తీలోని తలాబ్ చంచలం డివిజన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలో జరుగుతున్న సిసి రోడ్ పనులను అలాగే పైప్లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను వేగంగా పూర్తి చేయాలని పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.