ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేములకోట గ్రామం వద్ద ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై అంకమ్మరావు సిబ్బందితో కలిసి సంఘటన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. సంబంధిత వివరాలను డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు.