తాడిపత్రి: ప్రేమ విఫలం కావడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తాడిపత్రి మండలం పెద్దపొడమలకు చెందిన యువకుడు
ప్రేమ విఫలం కావడంతో రైలు కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన తాడిపత్రి నియోజకవర్గం లో చోటుచేసుకుంది. తాడిపత్రి మండలం పెద్దపోలమడకు చెందిన సోమశేఖర్ కోమలి-జూటూరు రైల్వే స్టేషన్ల మధ్య బ్రిడ్జి వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.