విద్యారంగంలో ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కారాని ప్రత్యేక కృషి చేస్తానని ఎస్టీయూఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్రెడ్డి సంగమేశ్వర రెడ్డి అన్నారు. ఆ మేరకు ఎస్టీయూఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షునిగా వేంపల్లెకు చెందిన నర్రెడ్డి సంగమేశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండేళ్లకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి నంద్యాల జిల్లా అధ్యక్షుడు మౌలాలి, పరిశీలకుడు రాష్ట్ర అదనపు కార్యదర్శి శివశంకర్ లు వ్యవహరించారు.