కొండపి: పొన్నలూరు మండలం కల్లూరు వారి పాలెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు, జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్న అధికారులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కల్లూరివారిపాలెం వద్ద పాలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాలేరులోకి వరద నీరు చేరింది. దీంతో కల్లూరివారిపాలెం నుంచి కె. అగ్రహారం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులు పాలేరును దాటేందుకు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. పాలేరు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ఎవరూ దానిని దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు.