తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున వెలసి ఉన్న పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇంకా రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలు వంటి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు పెన్నా నది ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.