ద్విచక్ర వానాన్ని ఢీకొట్టిన కారు ఒకరికి తీవ్ర గాయాలు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండలంలోని బైపాస్ రోడ్ లో షాది మహల్ వద్ద మంగళవారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడం జరిగింది కుప్పం పూల మార్కెట్ నుంచి పూలు కర్ణాటకలో తీసుకెళ్తున్న కారు రాంగ్ రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో బంగారు నత్తం గ్రామానికి చెందిన యువకుడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు