మార్కాపురం: మార్కాపురం మండలంలోని పలు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బుజ్జి భాయి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ పంచాయతీ పరిధిలోని తూర్పు వీధి పడమర వీధిలలో మండల వ్యవసాయ అధికారి ని బుజ్జి భాయి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు కావలసిన ఎరువులు రైతు సేవా కేంద్రంలో మరియు బయట దుకాణాలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. పొగాకు బ్లాక్ బర్లి ఎవరు సాగు చేయొద్దని పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. రైతులందరూ టొబాకో బోర్డు కంపెనీ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వారు మాత్రమే సాగు చేసుకోవాలని తెలిపారు. మొక్కజొన్న వేసుకున్న రైతులు కచ్చితంగా కంపెనీ నుంచి బాండ్ తీసుకోవాలని తెలిపారు.