చీమకుర్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు నల్లూరి వెంకటేశ్వరరావు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు. జిల్లా ఈటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావును జిల్లాలోని ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన జిల్లా కార్యదర్శిగా ఎంపిక కావడం వరుసగా ఇది ఎనిమిదవ సారి. సోమవారం జిల్లా కార్యదర్శిగా ఎంపికైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.... తనను ఎనిమిదవ సారి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ఉపాధ్యాయులకు యుటిఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.