తాడిపత్రి: ఏయ్ ఏఎస్పీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు: తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తావా? ఏయ్ ఏఎస్పీ అంటూ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు పడేసుకున్నారు. తాడిపత్రిలో మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన మాట్లాడారు. ఏఎస్పీ మిలటరీ డ్రెస్ వేసుకొని ప్రెస్ మీట్ లు పెట్టి తాను వచ్చాక తాడిపత్రిలో క్రైమ్ రేటును తగ్గించానని సెల్ఫ్ కొట్టుకుంటున్నాడన్నారు. నువ్వు వచ్చాక కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. ఏఎస్పీని వదిలే ప్రసక్తే లేదన్నారు. రేపు లాయర్ ద్వారా ఏఎస్పీకి నోటీస్ పంపిస్తానన్నారు. కేసు కూడా వేస్తానన్నారు.