కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు జరిగిన తొక్కిసలాట మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు జరిగిన తొక్కిసలాట మృతులకు పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. మృతులకు సంతాప సూచికంగా పీలేరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలతో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు