మహానంది మండలం మసీదుపురం గ్రామంలో అభివృద్ధికి బాటలు వేశారు, జాతీయ రహదారి 18 నుంచి మసీదుపురం వరకు మొత్తం రూ.90 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను ఈరోజు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగాMLA మాట్లాడుతు,ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే ప్రతి గ్రామంలో శాశ్వతంగా సీసీ రోడ్లు, త్రాగునీటి వంటి మౌలిక సదుపాయాలు అందించడం సాధ్యమవుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధితో ప్రజల మన్ననలు సంపాదించుకున్నామని తెలిపారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో…అభివృద్ధినే ఆయుధంగా, సేవనే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేసారు.