అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామానికి చెందిన శివ గంగమ్మ అనే మహిళను ఆమె భర్త సుంకన్న రాయితో దాడి చేసి గాయపరిచిన ఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని ప్రభుత్వ సర్వజనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.