తాడిపత్రి: పెద్దవడుగూరు మండల పరిధిలోని నేషనల్ హైవే ఎన్ హెచ్ 44పై యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లలో సైన్ బోర్డులను ఏర్పాటు చేసి పోలీసులు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు పెద్దవడుగూరు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 హైవే మీద మిడుతూరు నుంచి గేట్స్ కళాశాల వరకు పెద్దవడుగూరు మండల పోలీసులు సైన్ బోర్డ్స్ లను ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ లను గుర్తించి ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లు పెద్దవడుగూరు ఎస్సై తెలిపారు.