దాన్యం బస్తాల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం బొమ్మనహాల్ - కణేకల్లు క్రాస్ మద్య గనిగెర గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎల్ బి నగర్ లో ఓ వ్యాపరి వరి రైతు నుంచి కొనుగోలు చేసి లారీలో కర్నాటక తరలిస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టినట్టు స్థానికులు తెలిపారు.