సూర్యాపేట: విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలి: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు టోర్నమెంట్ను సెలెక్షన్స్ కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని అన్నారు. క్రీడల్లో నిరంతరం సాధన చేస్తే తమ లక్ష్యాన్ని చేరవచ్చని అన్నారు.