జగన్ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి..అసెంబ్లీలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్
జగన్ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో గురువారం ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనను వైకాపా కార్యకర్తలు అడ్డుకుని అల్లర్లు సృష్టించారని అడ్డుకున్న 120మందికి పైన అక్రమ కేసులు పెట్టారని అన్నారు. 1962 సంవత్సరం నుండి రాజకీయంలో ఉంటూ మచ్చలేని కుటుంబం తమ నల్లారి కుటుంబం అని, ఎలాంటి కేసులు లేని తనపై జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ తన పై 307 మరియు ఇతర అక్రమ కేసులు పెట్టారని అన్నారు