శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని ఎర్ర జంగన్న గారి పల్లి గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.