యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో భక్తులకు షాక్ ,వ్రతం టికెట్ ధర పెంపు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులపై ఆలయ అధికారులు స్వల్ప భారం మోపారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరణి పెంచుతూ ఆలయ ఈవో వెంకట్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వ్రతం టికెట్ ధర రూ. 800 ఉండగా ప్రస్తుతం దానిని 1000 రూపాయలకి పెంచారు .కానీ ఇప్పుడు సామాగ్రి తో పాటు స్వామివారి శేష వస్త్రాలు, విగ్రహ ప్రతిమను ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.