జమ్మలమడుగు: బద్వేల్ : నియోజకవర్గం పరిధిలోని చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలం సండ్రపల్లి చెరువును, సంగసముద్రం చెరువును మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి పరిస్థితుల గురించి స్థానిక ప్రజలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విజయమ్మ మాట్లాడుతూ చెరువుకు నీరు ఎక్కువ అవుతుండడంతో చెరువు తెగకుండా ఉండే దానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.