పుంగనూరు: మండల టిడిపి అధ్యక్షుడు పదవికి ధరఖాస్తు చేసుకున్న.
యువ నాయకుడు కోలారు సుబ్రహ్మణ్యం రాజు.
పుంగనూరు మండల టిడిపి అధ్యక్షుని పదవి కోసం యువనేత కోలారు సుబ్రహ్మణ్యం రాజు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మాట్లాడుతూ పార్టీ కోసం చంద్రబాబునాయుడు ఆశయాల కోసం సర్వశక్తుల పనిచేశానని అన్నారు. గత వైకాపా పాలనలో తనపై18 అక్రమ కేసులు పెట్టినా, ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా, పార్టీ కోసం ప్రజల ఆశయాలను గౌరవిస్తూ ముందుకు అడుగులు వేశాననిఅన్నారు.పార్టీ సిద్ధాంతాల కోసం సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.