అసిఫాబాద్: నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలి: అసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్
హోటల్,రెస్టారెంట్, స్వీట్ హౌస్,బేకరి దుకాణాల్లో పరిశుభ్రతతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గాజానంద్ అన్నారు. మంగళవారం సాయంత్రం 6:30లకు ASF మున్సిపల్ కార్యాలయంలో దుకాణాల యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క దుకాణదారుడు శుభ్రత పాటించి,నాణ్యమైన ఆహార పదార్థాలు అమ్మాలని సూచించారు. ప్రతి వ్యాపారి ట్రేడ్ లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు.