కాట్రపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో యువకుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
కాట్రపల్లిలో యువకుడికి కరెంట్ షాక్ Kvb puram (M) విద్యుత్ ఘాతంతో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన KVBపురం మండలం కాట్రపల్లిలో బుధవారం ఉదయం జరిగింది. 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. క్షతగాత్రుడిని అస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.