తాడేపల్లిగూడెం: జగన్మోహన్ రెడ్డి తోనే సంక్షేమ పథకాలు అమలు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలవుతాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం మండలం కేఎస్ఎన్ కాలనీ, కొండ్రుప్రోలు, ఎల్. అగ్రహారం, పుల్లాయగూడెం,అప్పరావుపేట గ్రామాల్లో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ వైస్ ఛైర్మన్ రఘురామ్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే యీలి నానితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ చంద్రబాబు మాటలను నమ్మవద్దన్నారు.