ఇబ్రహీంపట్నంలో బూడిద సమస్యపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న మాజీమంత్రి జోగి రమేష్ ను అడ్డుకున్న పోలీసులు
Mylavaram, NTR | Sep 15, 2025 ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ నుండి వచ్చే బూడిద అక్రమ రవాణా విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇబ్రహీంపట్నంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ కొద్దిసేపు ఉధృత పరిస్థితి చోటుచేసుకుంది పోలీసులకు జోగి రమేష్ కు మధ్య వాగ్వాదం జరిగింది కొద్దిసేపటి తర్వాత పోలీసులు జోగి రమేష్ ను వెళ్ళనీయడంతో కథ సుఖాంతమైంది.