అబద్ధాలు ప్రచారంలో, నటనలో బొల్లాకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : ప్రభుత్వ ఛీఫ్ విప్ జీవీ
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారంలో, నటనలో బొల్లాకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు. మాట్లాడితే మీ బ్రతుకులు అంటావు 30 ఏళ్ల క్రితం నీ బ్రతుకు ఏంటో ..వినుకొండ ప్రజకు బాగా తెలుసు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన హెచ్చరించారు.