3 గంటలు ఆలస్యంగా పినాకిని ఎక్స్ప్రెస్
Gudur, Tirupati | Sep 16, 2025 చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ మంగళవారం సుమారు 3 గంటలు ఆలస్యంగా నడిచింది. ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఈ రైలు గూడూరుకు సాయంత్రం 4.13కు రావాల్సి ఉండగా 7.10కు చేరుకుంది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. దీని పై రైల్వే అధికారులను 9 గంటల ప్రాంతంలో అడగగా చెన్నై వెళ్లే రైలు ఆలస్యం కావడంతో ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు.