ఇబ్రహీంపట్నం: ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండదండగా ఉంటుంది : రాజేంద్రనగర్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ లో 275 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఎప్పుడూ అండదండగా ఉంటుందని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.