పెడనలో సచివాలయ సిబ్బందికి P4 పథకంపై శిక్షణ
Machilipatnam South, Krishna | Sep 23, 2025
పెడనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకంపై పెడన మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్య దర్శులు, సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్య క్రమం జరిగింది. ఎంపీడీఓ అరుణకుమారి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.