మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం వెళ్తున్న రైలు నుంచి జారిపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన మృతుడి వివరాలు తెలియలేదని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.