మేడ్చల్: పేట్ బషీరాబాద్ లో సెంట్రింగ్ సామాగ్రి దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
పెట్ బషీరాబాద్ ఏసిపి బాల గంగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాత్రివేళలో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని దొంగిలిస్తున్న ముఠాను ఆల్వాల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి మూడు లక్షల రూపాయల విలువైన సెంట్రింగ్ సామాగ్రి, నాలుగు సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక మైనర్ తో సహా మొత్తం ఐదు మందిని అరెస్టు చేసి, వారిని రిమాండ్ కు తరలించారు. జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జిహెచ్ఎంసి లో చెత్త సేకరించి ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.