తాడిపత్రి: పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ముగ్గురికి తీవ్ర గాయాలు
పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మిడుతూరు సమీపంలో ముందు వెళ్తున్న రెండు బైకులను వెనక నుంచి కారు ఢీకొంది. ప్రమాదంలో గుండాలతండాకు చెందిన వెంకటేష్ నాయక్, గణేష్ నాయక్, రామరాజుపల్లికి చెందిన మల్లేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.