ద్విచక్ర వాహనదారులకు హెల్మెంట్ తప్పనిసరి
- వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన నాయుడుపేట అర్బన్ సిఐ బాబి
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం లోని కొత్తపేట క్రాస్ రోడ్డు వద్ద నాయుడుపేట అర్బన్ సీఐ బాబి సోమవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన మేనకూరు పారిశ్రామిక వాడ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడే అక్కడే కొత్త హెల్మెట్ కొని ధరింప చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల అనుకోని ప్రమాదాల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సూచించారు. మన భద్రత మన కుటుంబం సం