రేణిగుంట బస్టాండ్లో ఇబ్బందికర స్తంభం తొలగించిన అధికారులు
రేణిగుంట బస్టాండ్లో ఇబ్బందికర స్తంభం తొలగింపు రేణిగుంట బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్కు ఆటంకంగా మారిన కరెంటు స్తంభాన్ని అధికారులు శనివారం తొలగించారు. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి వెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ జయచంద్ర, విద్యుత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి మాధవి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.