భారీ వర్షాల కారణంగా నందనం గ్రామానికి స్తంభించిన రాకపోకలు
నందనం గ్రామానికి స్తంభించిన రాకపోకలు నాగలాపురం మండలంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందనం గ్రామం వద్ద వంకలో నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది. ప్రజలు నందనం గ్రామానికి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. వంక వద్ద వంతెన నిర్మించాలని పలుమార్లు విన్నవించినా ఎవరు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు.