ఆందోల్: సంగారెడ్డి లో ఉచిత టు వీలర్ మెకానిక్ శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం
సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ ప్రాంత యువతకు ఉచిత టూవీలర్ మెకానిక్ శిక్షణ ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. 19 నుంచి 40 ఏళ్లలోపు పురుషులు అర్హులు. గురువారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసక్తిగలవారు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9490103390, 9490129839 నంబర్లలో సంప్రదించవచ్చు.